కళింగ యుద్ధం

కళింగ యుద్ధం

 కళింగ యుద్ధానికి ముందు అశోకుడిని చండాశోకుడు అని పిలిచేవారు. పట్టాభిషేకం జరిగిన 9వ సంవత్సరంలో కళింగయుద్ధం జరిగినట్లు అశోకుని 13వ శిలాశాసనంలో పేర్కొన్నారు. అశోకుడు కళింగను ఆక్రమించడంలోని ముఖ్యోద్దేశం మౌర్య వ్యాపార నౌకలను దోపిడీ చేస్తున్న నాగ తెగలను శిక్షించడం. దయానదీ తీరంలో ఈ యద్ధం జరిగింది. కళింగ యుద్ధంలో కళింగ రాజులు థిమోవశి, మేఘవాహన పాల్గొన్నారు. 

ఈ యుద్ధంలో సుమారు లక్ష మంది మృతిచెందగా, లక్షన్నరు పైచిలుకు బానిసలయ్యారు. కళింగ యుద్ధానంతరం హృదయ పరివర్తన కలిగిన అశోకుడు భేరిఘోష కంటే ధమ్మఘోష గొప్పదని నిర్ణయించుకున్నాడు. కళింగ యుద్ధానంతరం అశోకుడు ఐదు సంవత్సరాల తర్వాత బౌద్ధ మతాన్ని అవలంబించారు.