అష్టసూత్ర పథకం.. బిట్ బ్యాంక్

1969 జూన్​ 1న తెలంగాణ పత్రికా రచయిత సంఘం ఆవిర్భవించింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 జనవరిలో ఉద్యమ కార్యాచరణ మొదలైంది. 

ఉద్యమ కార్యాచరణలో భాగంగా 1969 మార్చి 17న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా పాటించారు. 

1969 ఏప్రిల్​ 11న ఇందిరాగాంధీ పార్లమెంట్​లో అష్టసూత్ర పథకాన్ని ప్రకటించారు. 

ఏప్రిల్​ 22న ఉద్యమకారులు విద్రోహదినంగా పాటించారు.

తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షునిగా పోటీ చేసి వెంకట్రాంరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. 

1969 మే 17న ఉద్యమకారులు కోర్కెల దినంగా పాటించారు. 

చంచల్​గూడ జైలులో తెలంగాణ సత్యాగ్రహులపై మే 31న ఆంధ్ర ప్రాంతం వారు దాడి చేశారు. 

1969 జూన్​ 2న జరిగిన నిరసన సందర్భంగా జరిగిన కాల్పుల్లో 13 మంది ఉద్యమకారులు మరణించారు.

హైస్కూల్​ పరీక్షలు బహిష్కరించాలని విద్యార్థులు పిలుపునిచ్చిన సందర్భంలో జరిగిన కాల్పుల్లో 20మంది ప్రాణాలను కోల్పోయారు. 

ప్రభుత్వ నిర్బంధ విధానాలను నిరసిస్తూ ఉద్యమకారులు జూన్​ 16న నిర్బంధ వ్యతిరేక దినాన్ని పాటించారు. 

సత్యాగ్రహం, ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు భైఠాయింపు, సహాయ నిరాకరణ, జైల్​భరో తదితర కార్యక్రమాలు 1969 జూన్​ 19 నుంచి జూన్​ 24 వరకు జరిగాయి. 

ముషీరాబాద్​ జైలులో ఉన్న తెలంగాణ ఉద్యమకారులపై 1969 జూన్​ 24న ఆంధ్ర ప్రాంత ఖైదీలు దాడికి పాల్పడ్డారు. 

మర్రి చెన్నారెడ్డితోపాటు దాదాపు 16 మంది ముఖ్య నాయకులను పోలీసులు జూన్​ 24 రాత్రి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఉద్యమానికి సదాలక్ష్మి, మదన్ మోహన్​ నాయకత్వం వహించారు. 

ఉద్యోగుల నిరవధిక సమ్మె 1969 జూన్​ 10న ప్రారంభమైంది. 
 

జూన్​ 30న మహిళల ఊరేగింపు రాజ్​భవన్​ వరకు సాగింది.

జులై 10న నల్లజెండాల దినంగా పాటించారు. 

జులై 12న తెలంగాణ జెండాల దినంగా పాటించారు. 

1969 జులై 19న కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో పదవులు స్వీకరించిన  తెలంగాణ మంత్రుల వైఖరిని నిరసిస్తూ విద్రోహుల వ్యతిరేక దినం జరిపారు. 

శాసనసభ సమావేశాలకు ముందు రోజు ఈశ్వరీబాయి, జి.వి.సుధాకర్​రావు, పాల్వాయి గోవర్ధన్​రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కొండా లక్ష్మణ్​ బాపూజీ నేతృత్వంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం 1970 ఫిబ్రవరి 3న జరిగింది. 

గన్​పార్క్​లో అమరవీరుల స్తూపానికి 1970 ఫిబ్రవరి 23న శంకుస్థాపన జరిగింది. 

గన్​పార్క్​లో అమరవీరుల స్తూపానికి పోలీసుల కళ్లుగప్పి అనుకున్న సమయానికి మేయర్​ లక్ష్మీనారాయణ శంకుస్థాపన పూర్తిచేశారు. 

సికింద్రాబాద్​ క్లాక్​టవర్​ వద్ద మరో అమరవీరుల స్తూపానికి 1970 ఫిబ్రవరి 25న శంకుస్థాపన జరిగింది. 

తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర సభలు 1970 ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో జరిగాయి.

తెలంగాణ ప్రజా సమితి, సామూహిక దీక్షలు 1970 ఏప్రిల్​, మే నెలల్లో జరిగాయి.

197‌‌‌‌0 జూన్​లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజాసమితి అభ్యర్థి నాగం కృష్ణారావు గెలుపొందారు. 

తెలంగాణ ప్రజాసమితి రాజకీయ పార్టీగా మారడాన్ని కొండా లక్ష్మణ్​ బాపూజీ వ్యతిరేకించారు. 

శాసనమండలి ఎన్నికల్లో ప్రజాసమితి పార్టీ మూడు సీట్లను గెలుపొందింది.

కాంగ్రెస్​లోని తెలంగాణ శాసన సభ్యులు 1970 ఫిబ్రవరి 6న ఐక్య సంఘటనగా ఏర్పడ్డారు. 

శాసన మండలి ఎన్నికల్లో ఐక్య సంఘటన ఒక స్థానంలో గెలుపొందింది. 

సిద్దిపేట నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మదన్​మోహన్​ విజయం సాధించారు.

1969 ఉద్యమకాలంలో పోలీసుల దాడులు, లకాల్పుల్లో 350 మంది మరణించారు. 

1969 జులైలో హోంమంత్రిగా జలగం వెంగళరావు బాధ్యతలు చేపట్టారు.

1971 లోక్​సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి 10 సీట్లు గెలిచింది. 

1971 లోక్​సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 47శాతం ఓట్లు సాధించింది.

దామోదరం సంజీవయ్య తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా రీజనల్​ కమిటీ విజ్ఞప్తులను పట్టించుకోలేదని కొండా లక్ష్మణ్​ బాపూజీ విమర్శించారు. 

1969 మేలో యూనివర్సిటీ కాలేజ్​ అధ్యాపకుల కన్వెన్షన్​లో సమర్పించిన పత్రాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అంశాల్లో తెలంగాణకు జరిగిన నష్టాన్ని గణాంకాల ఆధారంగా వివరించారు. 
1969లో యూనివర్సిటీ కాలేజ్​ అధ్యాపకుల కన్వెన్షన్​ సదస్సును రావాడ సత్యనారాయణ ప్రారంభించారు.