వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ స్పిన్నర్ ఔట్

వరల్డ్ కప్ లో గాయాలతో టోర్నీ నుండి వైదొలిగే ప్లేయర్ల సంఖ్య రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు గాయంతో ఈ మెగా ఈవెంట్ ఆడే అవకాశాన్ని కోల్పోగా.. తాజాగా ఆ లిస్టులోకి ఆస్ట్రేలియా స్టార్ స్పిన్న ఆష్టన్ అగర్ వచ్చేసాడు. దక్షిణాఫ్రికా సిరీస్  లో భాగంగా కాఫ్ ఇంజ్యూరీతో ఇబ్బందిపడ్డ అగర్.. ఇంకా కోలుకోలేదని సమాచారం. దీంతో ఆసీస్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో అగర్ ఉండే అవకాశాలు దాదాపుగా లేనట్లే. 

అగర్ ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రేలియా యొక్క తాత్కాలిక ప్రపంచ కప్ జట్టులో ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో ఒక మ్యాచ్ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిపోయిన ఈ స్పిన్ ఆల్ రౌండర్.. ఆ తర్వాత గాయంతో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆసీస్ రేపు అధికారికంగా వరల్డ్ కప్ ఆడే  15 మంది జట్టు సభ్యులను ప్రకటించనుంది. అగర్ కి ప్రత్యామ్నాయంగా మాథ్యూ షార్ట్‌ ని సెలక్ట్ చేసే అవకాశం ఉంది.

ALSO READ: రోహిత్ శర్మని చూసి నేర్చుకో.. తమీమ్‌పై బంగ్లా కెప్టెన్ ఫైర్

స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల నైపుణ్యమున్న అగర్ లాంటి ఆల్ రౌండర్ ని కోల్పోవడం ఆసీస్ జట్టుకి పెద్ద ఎదురు దెబ్బె అని చెప్పాలి. గత వారంలో ఓపెనర్ హెడ్ కూడా గాయంతో వరల్డ్ కప్ కి దూరమైన సంగతి తెలిసిందే. కాగా ఆసీస్ తాజాగా భారత్ తో సిరీస్ కోల్పోయినా .. చివరి మ్యాచులో గెలిచి ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్ లోకి అడుగుపెడుతుంది. వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్ ని భారత్ తో ప్రారంభించనున్నారు. అక్టోబర్ 8న చెన్నైలో ఈ మ్యాచ్ జరగబోతుంది.