లక్నోకు ఊహించని షాక్.. కోటి రూపాయల ప్లేయర్‌కు సర్జరీ

లక్నోకు ఊహించని షాక్.. కోటి రూపాయల ప్లేయర్‌కు సర్జరీ

ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆరుగురు ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్ లో భారీ ధరకు ఎంపికయ్యారు. మిచెల్ స్టార్క్ (24.75), పాట్ కమిన్స్(20.50) కలిసి 45 కోట్లు వసూలు చేయడం 2023 మినీ వేలంలో హైలెట్ గా మారింది. వీరితో పాటు స్పెన్సర్ జాన్సన్ కు 10 కోట్లు, ట్రావిస్ హెడ్ 6.80కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యారు. ఇక విధ్వంసకర ప్లేయర్ అష్టన్ టర్నర్ కోటి రూపాయలకు లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది.

టీ20 క్రికెట్ లో పవర్ హిట్టింగ్ చేయగల టర్నర్ ను కోటి రూపాయలకు దక్కడంతో లక్నో పండగ చేసుకుంది. అయితే ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఈ రోజు(డిసెంబర్ 22) ఈ ఆసీస్ వీరుడు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ లో పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్ గా ఉంటున్న టర్నర్.. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు. దీంతో మిగిలిన బిగ్ బాష్ మ్యాచ్ లకు టర్నర్ దూరం కానున్నాడు. మోకాలి సర్జరీ చేయించుకోవడం టర్నర్ కు ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు మోకాలి గాయం టర్నర్ కెరీర్ ను దెబ్బ తీసింది.
 

సర్జరీ చేయించుకున్న ఈ ఆసీస్ స్టార్ తిరిగి ఎప్పుడు క్రికెట్ లోకి అడుగుపెడతాడో తెలియదు. టర్నర్ కు కెప్టెన్సీ అనుభవంతో పాటు, బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించగలడు. అప్పుడప్పుడూ బౌలింగ్ లోనూ మ్యాజిక్ చేయగలడు. బిగ్ బాష్ లీగ్ లో పెర్త్ స్కార్చర్ జట్టుకు టర్నర్ వరుసగా రెండు సార్లు టైటిల్ అందించాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్ లక్నో జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటుగానే భావించాలి. డికాక్, మేయర్స్, పడికల్, రాహుల్, హుడా, పూరన్, స్టయినీస్ లతో దుర్బేధ్యంగా కనిపిస్తుంది.