
ఆదివారం (ఏప్రిల్ 27) ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుండగా ఇద్దరు ప్లేయర్లకు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ఫీల్డింగ్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 19 ఓవర్ రెండో బంతిని స్లో బాల్ వేశాడు. ఈ బంతిని తిలక్ వర్మ షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు స్లైస్ చేశాడు. అక్కడ క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో అశుతోష్ శర్మ, ముఖేష్ కుమార్ ఢీ కొన్నారు.
ఇద్దరి పరిస్థితి తెలుసుకొని ఫిజియో వచ్చి అశుతోష్, ముఖేష్ ను గ్రౌండ్ లో నుంచి బయటకు తీసుకెళ్లారు. ముఖేష్ చివరి ఓవర్ లో బౌలింగ్ చేశాడు. దీంతో అతనికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తుంది. అశుతోష్ శర్మ గాయంపై ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రమాదకరమైన గాయాలేవీ జరగకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముకేశ్ కుమార్ తిరిగి గ్రౌండ్ లోకి రాకపోవచ్చు. కానీ భారీ లక్ష్య ఛేదనలో అశుతోష్ శర్మ లేకపోతే ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బే. ముకేశ్ కుమార్ ఢిల్లీ కీలక బౌలర్ కాగా.. అశుతోష్ శర్మ పవర్ హిట్టర్.
Also Read : ఢిల్లీ ముందు భారీ స్కోర్ సెట్ చేసిన ముంబై
collision between mukesh and ashutosh hope not serious #dcvsmi pic.twitter.com/zigjDvJw0e
— Prince ayaz (@AyazMoh123) April 13, 2025
ఈ మ్యాచ్ విషయానికి వస్తే తిలక్ వర్మ (33 బంతుల్లో 59: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు.. రికెల్ టన్ (41), సూర్య కుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.