తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైలును అందిస్తుంది. ఆదివారం ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ఏర్పాట్ల ను రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, రైల్వే బోర్డ్ చైర్మన్ సీఈవో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీ ఎం అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. వందే భారత్ రైలు వద్ద రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి తదితరులు ఫొటోలు దిగారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలు ఆదివారం పరుగులు పెట్టనుంది. ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన వందే భారత్ రైలును సంక్రాంతి పండగ కానుకగా నాలుగు రోజుల ముందుగానే అందుబాటులోకి వస్తోంది.
వందే భారత్ రైలును వైజాగ్ వరకు పొడిగించినందుకు ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇప్పటివరకు తెలంగాణకు రూ.5వేల కోట్లకు పైగా నిధులిచ్చామన్నారు. దేశంలో ఎయిమ్స్ హస్సిటల్స్ ను పెంచిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.