ములకలపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ములకలపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ములకలపల్లి, వెలుగు : మండలంలో పలు అభివృద్ధి పనులకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం శంకుస్థాపన చేశారు. ములకలపల్లి పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద వైయస్సార్ కాలనీ, డబుల్ బెడ్ రూమ్ కాలనీ, ములకలపల్లి శ్మశాన వాటిక, రాజుపేట కాలనీలలో నిర్మించే సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు. రాజుపేట శివారు పాములేరు వాగు, పాత జిన్నల గూడెం వద్ద రూ.4.90 కోట్టు తో  నిర్మించే రెండు చెక్ డ్యామ్​ల పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ సురేశ్​కుమార్, డీఈ మోతిలాల్, ఆర్ ఐ సత్యవతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు,  మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, నాయకులు పువ్వాల మంగపతి, గాడి తిరుపతిరెడ్డి, కారం సుధీర్, కొప్పుల రాంబాబు, శనగపాటి అంజి,రవి,సురబీ రాజేశ్​ తదితరులు పాల్గొన్నారు.