ములకలపల్లి, వెలుగు: ములకలపల్లి మండలంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గురువారం సుడిగాలి పర్యటన చేశారు. మొత్తం రూ.22కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాచన్నగూడెంలో రూ.5లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. మంగపేట, రామాంజనేయపురం మధ్య రూ.2కోట్లతో, కొమ్ముగూడెం, అల్లిగుంపు మధ్య రూ1.12కోట్లతో, చౌటిగుడెం, రింగిరెడ్డిపల్లి మధ్య రూ.1.60కోట్లతో, జగన్నాథపురం, రేగులకుంట మధ్య రూ.1.68కోట్లతో, జిన్నెలగూడెం, రాచన్నపేట మధ్య రూ1.12కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ముత్యాలంపాడులో సీసీ రోడ్డును ప్రారంభించారు.
రూ.4.63కోట్లతో కుమ్మరిపాడులో, ముత్యాలంపాడులో రూ.5.25కోట్లతో హై లెవల్ బ్రిడ్జి, రూ.4.50కోట్లతో రింగిరెడ్డిపల్లి వద్ద నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జిల పనులకు శంకుస్థాపన చేశారు. పూసుగూడెంలో రూ.20లక్షలతో నిర్మించిన పంచాయతీ బిల్డింగ్‌ను ప్రారంభించారు. వివిధ గ్రామాల్లో బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్చెక్కులు, స్పోర్ట్స్కిట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీఓ శ్రీను, ఎంపీఓ లక్ష్మయ్య, ఏఈలు సురేశ్, సుబ్బరాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.