అశ్వారావుపేటలో వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు

అశ్వారావుపేటలో వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు

అశ్వారావుపేట, వెలుగు: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగను అశ్వారావుపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలు ప్రకారం..  బుధవారం పట్టణంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు వద్ద ఎస్సై యయాతి రాజు వెహికల్స్​ తనిఖీ  చేస్తున్నాడు. భద్రాచలం రోడ్డు నుంచి అశ్వారావుపేట వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి తనిఖీ చూసి పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పట్టణంలోని దండా బత్తుల వారి వీధి కి చెందిన సరిపల్లి నరసింహారాజుగా గుర్తించారు. సులువుగా డబ్బులు 

సంపాదించాలని ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని మోటార్ సైకిళ్లను చోరీ చేసి తక్కువ ధరకు అమ్ముకొని వచ్చిన డబ్బులను జల్సాలు చేసేవాడని తేలింది. అతడి నుంచి 9 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.