అశ్వారావుపేట, వెలుగు : రాబరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అశ్వారావుపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ సతీశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్న శిరిడి సాయిబాబా ఆలయం వద్ద సీఐ కరుణాకర్ సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తున్నారు. వీరిని చూసిన ఇద్దరు వ్యక్తులు పారిపోతున్నారు. వారిని పోలీసులు వెండించి అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన బచ్చు సతీశ్, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన ఆరింపుల ధర్మరాజుగా గుర్తించారు.
వారిపై సత్తుపల్లి, వెంసూరు, చాట్రాయి, విసన్నపేట, రేపల్లె, నూజివీడు, మైలవరం, అవనిగడ్డ, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో అనేక దోపిడీలు, దొంగతనాలకు సంబంధించిన 15 కేసులు ఉన్నట్లుగా తేలింది. నిందితుల నుంచి మూడు తులాల బంగారు నాన్, రెండు మంగళ సూత్రాలు, 18 గ్రాముల బంగారపు కడ్డీ, ఒక టూ వీలర్ ఒక సెల్ ఫోన్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలోఅశ్వారావుపేట, దమ్మపేట ఎస్ఐలు యయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి, విజయసింహారెడ్డి, ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర, లక్మీపతి, రామారావు, వెంకన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.