ఆ సమయంలో పుజారా ఎంతో సహాయం చేశాడు: అశ్విన్ భార్య ఎమోషనల్

ఆ సమయంలో పుజారా ఎంతో సహాయం చేశాడు: అశ్విన్ భార్య ఎమోషనల్

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కెరీర్ లో వందో టెస్టు ఆడబోతున్నాడు. ఇప్పటివరకు భారత్ తరపున 99 టెస్టులాడిన ఈ ఆఫ్ స్పిన్నర్.. రేపు ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదో టెస్ట్ ద్వారా 100 టెస్టులు పూర్తి చేసుకుంటాడు. ఈ సమయంలో అశ్విన్ భార్య పృథి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అశ్విన్ అమ్మగారి అనారోగ్యం గురించి మాట్లాడుతూ తనకు సహాయం చేసిన భారత క్రికెటర్లకు కృతజ్ఞతలు తెలిపింది.

రాజ్‌కోట్ టెస్ట్ సమయంలో అశ్విన్ 500 వికెట్లు పూర్తి చేసుకున్న 5 నిమిషాల తర్వాత పిల్లలు పాఠశాల నుండి తిరిగి వచ్చారు. ఆ సమయంలో మేము సంతోషంతో అశ్విన్ ను అభినందిస్తూ అతని ఫోన్ కు మెసేజ్ చేశాం. అప్పుడే ఆంటీ కుప్పకూలిపోవడంతో అకస్మాత్తుగా అరుపు వినిపించింది. కొద్దిసేపటికే మేము ఆమెను ఆసుపత్రిలో చేర్పించాం. ఆ సమయంలో చెన్నై నుంచి రాజ్‌కోట్ మధ్య విమాన సదుపాయం లేనందున అశ్విన్‌కి చెప్పకూడదని మేము నిర్ణయించుకున్నాము.

ఆ సమయంలో చెతేశ్వర్ పుజారాకు ఫోన్ చేశాను. అతని కుటుంబ సభ్యులు చాలా సహాయపడ్డారు. రోహిత్ (శర్మ), రాహుల్ భాయ్ (ద్రావిడ్), BCCI లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. వారి వలనే అశ్విన్ ఇక్కడకి చేరుకున్నాడు అని అశ్విన్ భార్య పృథి భావోద్వేగంతో మాట్లాడింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఆర్ అశ్విన్ భారత్-ఇంగ్లాండ్ 3వ టెస్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.   రెండో రోజు ఆటలో భాగంగా క్రాలి వికెట్ తీసుకున్న అశ్విన్.. టెస్ట్ కెరీర్ లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న తర్వాత తన తల్లి అనారోగ్యం కారణంగా రాజ్ కోట్ నుంచి చెన్నైకు వెళ్లాల్సి వచ్చింది.  

Also Read : పాక్ క్రికెటర్లకు ఆర్మీతో శిక్షణ