థ్రిల్​ చేస్తున్న హిడింబ.. ఈసారి హిట్ పక్క

థ్రిల్​ చేస్తున్న హిడింబ.. ఈసారి హిట్ పక్క

‘రాజుగారి గది’ ప్రాంచైజీతో  హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ బాబు..  ‘హిడింబ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అనిల్ కన్నెగంటి దీనికి దర్శకుడు. నందితా శ్వేత ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తోంది. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు.

 ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ ‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. అశ్విన్ మాట్లాడుతూ ‘నా క్లోజ్ ఫ్రెండ్ తేజ్ ఈ ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. అనిల్‌‌కి సినిమాలంటే ప్యాషన్. డిఫరెంట్ కాన్సెప్ట్‌‌ తీసుకున్నాడు. ఎవర్నీ డిజప్పాయింట్ చేయదని నమ్ముతున్నాం’అని అన్నాడు. ‘ట్రైలర్‌‌‌‌లో చూసింది కొంత మాత్రమే. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ ఇచ్చిన అశ్విన్‌‌కు థ్యాంక్స్’ అని చెప్పింది నందిత.  

అనిల్ మాట్లాడుతూ ‘చరిత్రలో దాగిన కొన్ని రహస్యాల ఆధారంగా ఈ కథ రెడీ చేశాం. ఇదొక హైబ్రిడ్ జానర్. ఇలాంటి కంటెంట్‌‌ను ఎవరూ టచ్ చేయలేదు. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. అశ్విన్‌‌లోని కొత్త యాక్టింగ్ స్కిల్స్ చూస్తారు’ అని చెప్పాడు. నిర్మాత శ్రీధర్, డివోపి రాజశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, లిరిసిస్ట్‌‌ కళ్యాణ్ చక్రవర్తి,  రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.