‘రాజుగారి గది’ ఫ్రాంచైజీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ డిఫరెంట్ స్ర్కిప్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తను హీరోగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత హీరోయిన్. శ్రీధర్ గంగపట్నం నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ, ట్రైలర్ లోడింగ్ అంటూ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తాయంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అశ్విన్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. శుభలేఖ సుధాకర్, శ్రీనివాసరెడ్డి, రఘు కుంచె, రాజీవ్ కనకాల, సమీర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నాడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాస్తున్నారు.