టీమిండియా వెటరన్ స్పిన్నర్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లో తన బౌలింగ్ తో బ్యాటర్లను ముప్పు తిప్పపెట్టిన అశ్విన్ అడపాదడపా తన బ్యాటింగ్ తో మెప్పిస్తాడు. అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్ మాత్రం బ్యాటింగ్ లో ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు. ఓపెనర్ గా, టాపార్డర్ లో వచ్చి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా నాకౌట్ లో అశ్విన్ బ్యాటింగ్ టాప్ రేంజ్ లో ఉంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్ ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేసి జట్టును నాకౌట్ కు చేర్చాడు.
శుక్రవారం (ఆగస్టు 2) ఐడ్రీమ్ తిరూప్పూర్ తమిజన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఓపెనర్ అవతారమెత్తాడు. 109 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రారంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సులతో 69 పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. మరోవైపు బౌలింగ్ లోనూ సత్తా చాటి ఈ లీగ్ లో ప్రత్యర్థులకు చూపిస్తున్నాడు. అంతక ముందు చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన.. 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసి అదరగొట్టాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్ 19.4 ఓవర్లలో 108 పరుగుకే ఆలౌటైంది. మాన్ బఫ్నా 26 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సుబోత్ భాటి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీసుకొని ప్రత్యర్థిని కట్టడి చేశారు.109 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన దిండిగల్ డ్రాగన్స్ 10.5 ఓవర్లోనే 112 పరుగులు చేసి గెలిచి టీఎన్‌పీఎల్ 2024 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆగస్టు 4న లైకా కోవాయ్ కింగ్స్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
Ashwin on fire in TNPL knockouts! 🔥 Back-to-back POTM awards for Ashwin! 👏 pic.twitter.com/XD0Dsfke0F
— CricketGully (@thecricketgully) August 3, 2024