Ravi Ashwin: మ్యాచ్‌ టర్న్ చేశాడు.. నా దృష్టిలో అతడే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: అశ్విన్

Ravi Ashwin: మ్యాచ్‌ టర్న్ చేశాడు.. నా దృష్టిలో అతడే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: అశ్విన్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయం సాధించిన టీమిండియా సగర్వంగా మూడో సారి టైటిల్ అందుకుంది. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించిన భారత క్రికెట్ జట్టు 4 వికెట్ల తేడాతో కివీస్ పై ఘన విజయం సాధించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు.. సిరీస్ మొత్తం అద్బుతంగా రాణించిన న్యూజిలాండ్ ఓపెనర్ రచీన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. రచీన్ కు లభించిన ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ వరుణ్ చక్రవర్తికి రావాలని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. 

ఫైనల్ తర్వాత అశ్విన్ మాట్లాడుతూ " ఏం చెప్పినా.. ఏం చేసినా నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణ్ చక్రవర్తి. అతను మొత్తం టోర్నమెంట్ ఆడలేదు. అయినప్పటికీ అతను జట్టు విజయాల్లో అందరి కంటే ఎక్కువగా కీలక పాత్ర పోషించాడు. వరుణ్ లేకపోతే మ్యాచ్ లు చాలా భిన్నంగా ఉండేవి. అతను టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్. నేనే జడ్జిని అయితే వరుణ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చావాడిని. ఫైనల్లో కూడా చక్రవర్తి వికెట్లు ప్రభావం చూపాయి. గూగ్లీతో ఫిలిప్స్ ఔట్ చేశాడు. మ్యాచ్ లో ఇదే టర్నింగ్ పాయింట్ అని నేను భావిస్తున్నాను". అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నాడు.

Also Read :- దుబాయ్ పిచ్ లాహోర్ కంటే చాలా భిన్నంగా ఉంది

వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం మూడు మ్యాచ్ లే ఆడాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ ల్లో అతనికి అవకాశం లభించలేదు. మొత్తం మూడు మ్యాచ్ ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ పై గ్రూప్ మ్యాచ్ ల్లో 5 వికెట్లు పడగొట్టిన వరుణ్.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై రెండు.. ఫైనల్లో కివీస్ పై రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సెమీ ఫైనల్లో హెడ్ వికెట్ పడగొట్టడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఫైనల్లో కూడా విల్ యంగ్ వికెట్ తీసి భారత్ కు తొలి వికెట్ అందించాడు. అంతేకాదు క్రీజ్ లో కుదురుకున్న ఫిలిప్స్ ను బౌల్డ్ చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్  చేయకుండా  అడ్డుకున్నాడు.