భారత వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చాడు. ఫామ్ లో ఉన్న ఈ ఆఫ్ స్పిన్నర్ సడన్ గా ఎందుకు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడనే విషయం సస్పెన్స్ గానే ఉంది. బ్రిస్బేన్‌లో బుధవారం( డిసెంబర్ 18) బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
అశ్విన్ ముందుగానే తన నిర్ణయం చెప్పి ఫేర్ వెల్ టెస్ట్ ఆడి ఉండాల్సిందని సగటు భారత అభిమాని కోరుకున్నాడు. దశాబ్ధానికిపైగా స్వదేశంలో మ్యాచ్ లు జరుగుతుంటే అశ్విన్ ఒంటి చేత్తో భారత జట్టుకు విజయాలను అందించాడు. టెస్టుల్లో 500 పైగా వికెట్లు తీసిన ఈ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్.. తన అకస్మాత్ నిర్ణయంతో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. అశ్విన్ రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. బుధవారం (జనవరి 15) న అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఫేర్ వెల్ టెస్ట్ ఎందుకు ఆడలేదో క్లారిటీ ఇచ్చాడు.
"ఫేర్ వెల్ టెస్ట్ ఆడే అవసరం లేదు. నాకు ఫేర్ వెల్ టెస్ట్ ఆడాలని ఉంది. నాకు మరో టెస్ట్ ఆడే అవకాశం వచ్చినా జట్టులో స్థానం పొందేందుకు నేను అర్హుడిని కాను. నా వలన జట్టు కూర్పును ఇబ్బంది పెట్టడం నాకు కరెక్ట్ కాదు. బయట ప్రజలు ఎందుకు ఇంకా క్రికెట్ లో కొనసాగుతున్నాడు అనే ప్రశ్న ఎదురు కాకముందే రిటైర్మెంట్ ప్రకటిస్తే అదే గొప్ప సంతోషం అని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో ఫ్యాన్ వార్ చాలా దారుణంగా ఉంది". అని అశ్విన్ తెలిపారు.
అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్ లో అశ్విన్ ఆడతాడు. అతను 2025 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్ లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
R Ashwin didn’t want a farewell match just for the sake of it 👏🏻#RavichandranAshwin #CricketTwitter pic.twitter.com/AUuzPWgs6T
— InsideSport (@InsideSportIND) January 15, 2025