Ravichandran Ashwin: నా కెరీర్ ముగిసిపోలేదు.. ఓపిక ఉన్నంత కాలం ఆ జట్టుకే ఆడతా: అశ్విన్

Ravichandran Ashwin: నా కెరీర్ ముగిసిపోలేదు.. ఓపిక ఉన్నంత కాలం ఆ జట్టుకే ఆడతా: అశ్విన్

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్వదేశానికి చేరుకున్నాడు. గురువారం (డిసెంబర్ 19) అతను చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. చెన్నై ఎయిర్ పోర్ట్ కు దిగగానే అశ్విన్ కు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అశ్విన్ ను చూడడానికి అతని భార్య, పిల్లలు ఎయిర్ పోర్ట్ కు రావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ  2025 లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.

చెన్నై చేరుకున్న అశ్విన్ తన భవిష్యత్ గురించి మాట్లాడాడు. తన కెరీర్ ఇంకా అయిపోలేదని నేను ఐపీఎల్ లో కొనసాగుతానని స్పష్టం  చేశాడు. " రిటైర్మెంట్ ప్రకటించడం కఠిన నిర్ణయం. ఇది చాలా మందికి భావోద్వేగంతో కూడుకున్నది. ఎవరికైనా ఇది సహజమే. బ్రిస్బేన్ టెస్ట్ నాలుగో రోజు జరుగుతున్నప్పుడే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను. మ్యాచ్ ముగిశాక నా నిర్ణయాన్ని తెలపాలి అనుకున్నా. నా క్రికెట్ కెరీర్ అప్పుడే ముగిసిపోలేదు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడడానికి ఆసక్తితో ఉన్నాను. సాధ్యమైనంత ఎక్కువ కాలం తాను ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఆడతాను" అని అశ్విన్ స్పష్టం చేశాడు.

బుధవారం (డిసెంబర్ 18) బ్రిస్బేన్ టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ ను  అధికారికంగా ప్రకటించాడు. సిరీస్ మధ్యలో గుడ్ బై చెప్పడంతో ఈ వెటరన్ స్పిన్నర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులు ఆడే అవకాశం లేకుండా పోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో గ్రాండ్ డ్రెస్సింగ్ రూమ్ లో భారత క్రికెటర్లు ఈ వెటరన్ స్పిన్నర్ కు గ్రాండ్ గా ఫేర్ వెల్ ఇచ్చారు. 

Also Read :- పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

కేక్ కట్ చేసి చప్పట్లతో అశ్విన్ కు గ్రాండ్ గా వీడ్కోలు తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్ లో భారత ఆటగాళ్లు ఎమోషనల్ కాగా.. అశ్విన్ తన అద్బుతమైన స్పీచ్ తో ఈ ఫేర్ వెల్ కు ఘనంగా ముగింపు పలికాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లు అశ్విన్ కు ఊహించని  సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్, నాథన్ లియోన్ అశ్విన్ దగ్గరకు వచ్చి జెర్సీని బహుకరించారు. ఈ జెర్సీపై ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంతకాలు ఉండడంతో అశ్విన్ షేక్ హ్యాండ్ ఇస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. 

అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్ లో అశ్విన్ ఆడతాడు. అతను 2025 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.