లిక్కర్‌‌ దందా చేస్తున్న బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌: అశ్విని కుమార్‌‌ చౌబే

హనుమకొండ, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఢిల్లీలోని కేజ్రీవాల్‌‌ సర్కార్‌‌తో కలిసి లిక్కర్‌‌ దందా చేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని కుమార్‌‌ చౌబే ఆరోపించారు. వరంగల్‌‌ పశ్చిమ నియోజకవర్గంలోని హంటర్ రోడ్డులో బీజేపీ మీడియా సెంటర్‌‌ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ రెండూ కుటుంబ పార్టీలే అన్నారు. ఈ రెండింటిలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు చేసేదేమీ లేదన్నారు.

దేశంలో అవినీతిని పారదోలేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే, కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ మాత్రం అవినీతి పెంచి పోషిస్తున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధులు జాఫర్ ఇస్లాం ఖాన్‌‌, శ్వేతా శాలిని, వరంగల్‌‌ వెస్ట్‌‌ క్యాండిడేట్‌‌ రావు పద్మ, ఈస్ట్‌‌ క్యాండిడేట్‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, రాజేశ్వరరావు, వరంగల్‌‌ పార్లమెంట్‌‌ ప్రభారి మురళీధర్‌‌గౌడ్‌‌ పాల్గొన్నారు.

ALSO READ: బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి : అనురాగ్ ఠాగూర్