కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్‌లోని శానిటేషన్ సమస్యలను పరిష్కారంపై శ్రద్ధ వహించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే బల్దియా ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం బల్దియా హెడ్ ఆఫీస్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ప్రజల వద్ద నుంచి వచ్చి ఆర్జీలను బల్దియా కమిషనర్ స్వీకరించారు.
అనంతరం టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల పనితీరుపై నిర్వహించిన రివ్యూలో కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్ సంబంధ అంశాలపై సమీక్షించిన కమిషనర్ గ్రీవెన్స్‌లో శానిటేషన్ సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో పరిష్కారం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ వో డాక్టర్ రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.