కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: అభివృద్ధి పనులను స్పీడప్గా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ ప్రగతి, ముఖ్యమంత్రి హామీ నిధులు (సీఎంఏ), జీ ఓ.65 జనరల్ ఫండ్ తదితర పథకాల కింద కొనసాగుతున్న పనుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు.
ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన నేపథ్యంలో బల్దియాలోని 66 డివిజన్లలో కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 3 నెలల్లో పూర్తి చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు.