
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్నగరంలోని వన్ టౌన్ఏఎస్ఐ దత్తాత్రి (56) బుధవారం గుండెపోటుతో చనిపోయారు. గాయత్రీనగర్‌లో ఉంటున్న ఆయన ఉదయమే లేచి యోగా చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబీకులు ప్రైవేట్హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 1989లో కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరిన దత్తాత్రి అంచెలంచెలుగా ఏఎస్ఐ స్థాయికి ఎదిగారు. ఆయనకు భార్య, ఇంజినీరింగ్చదువుతున్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు.