భోజ్ శాల కాంప్లెక్స్​లో ఏఎస్ఐ సర్వే షురూ

భోజ్ శాల కాంప్లెక్స్​లో ఏఎస్ఐ సర్వే షురూ

ధార్: మధ్యప్రదేశ్ లోని వివాదాస్పద భోజ్ శాల/కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్ లో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే మొదలుపెట్టింది. శుక్రవారం 15 మందితో కూడిన టీమ్ అక్కడికి వెళ్లి సైంటిఫిక్ సర్వేను ప్రారంభించింది. రాష్ట్రంలోని ట్రైబల్ జిల్లా ధార్ లో ఉన్న ఈ కాంప్లెక్స్ పై హిందూముస్లింల మధ్య వివాదం నెలకొంది. ఇది సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు వాదిస్తుండగా, మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. 

ఈ క్రమంలో కోర్టుకు వెళ్లగా.. కాంప్లెక్స్ లో సైంటిఫిక్ సర్వే చేపట్టాలని ఏఎస్ఐకి ఈ నెల 11న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆరు వారాల్లోగా సర్వే రిపోర్టు అందజేయాలని చెప్పింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే మొదలుపెట్టింది. కాగా, ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ లో మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. సర్వే టైమ్ లోనూ ఇవి కొనసాగుతాయని, అందుకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.