Asia Cup2023: బ్యాడ్ న్యూస్.. పాకిస్తాన్ మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం

Asia Cup2023: బ్యాడ్ న్యూస్.. పాకిస్తాన్ మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం

ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్.. టోర్నీలోని తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. 

ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. టీమిండియా తన తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్, నేపాల్ జట్లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండరని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ మంగళవారం (ఆగస్టు 29) వెల్లడించారు.

ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రాహుల్ బెంగళూరులోని శిక్షణా శిబిరంలో కంఫర్ట్‌గానే బ్యాటింగ్ చేశాడు. ప్రాక్టీస్ సెష‌న్ లో కఠోర సాధ‌న చేస్తూ.. అల‌వోక‌గా సిక్స‌ర్లు బాదాడు. ఇంతలోనే అతడికి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 100 శాతం ఫిట్‌గా లేకపోవడంతో అతనికి మరో వారం రోజులు విశ్రాంతి ఇవ్వాలని కోచ్ ద్రవిడ్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, ఆసియా కప్ లో పాల్గొనేందుకు భారత జట్టు రేపు(ఆగష్టు 31) శ్రీలంక వెళ్లనుండగా.. రాహుల్ మరో వారం తర్వాత లంకకు పయనం కానున్నారు.