ఆసియాకప్ 2023లో భాగంగా కాసేపట్లో భారత్ -పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్ 4 లో భాగంగా దాయాది జట్లు తలపడనున్నాయి. కొలంబోలోని ప్రేమదాసు స్టేడియం వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే లీగ్ దశలో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఈ మ్యాచ్ అయినా సజావుగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్థానిక వాతావరణ శాఖ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందించింది.
మెల్లగా వస్తున్న సూర్యుడు..
ఇండియా పాక్ మ్యాచుకు వరుణుడు అడ్డంకి తగిలే అవకాశం ఉందని కొలంబో వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచులకు 90 శాతం వాన అడ్డంకిగా మారే ఛాన్సు ఉందని చెప్పింది. అయితే ఇదే వేదికపై సెప్టెంబర్ 9వ తేదీ శనివారం బంగ్లాదేశ్ -శ్రీలంక మ్యాచ్ సజావుగా సాగింది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ కూడా జరుగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అభిమానుల ఆశలకు తగ్గట్లుగా ప్రస్తుతం కొలంబోలో సాధారణ వాతావరణం నెలకొంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ప్రస్తుతం ఎండ వచ్చింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.
ALSOREAD:బౌలింగ్ ఎంచుకున్న పాక్.. తిరిగి జట్టులో చేరిన ఇద్దరు వీరులు
మరోవైపు ఈ మ్యాచులో టాస్ కీలకం కానుంది. కొలంబో ప్రేమదాస్ స్టేడియంలోని పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో..టాస్ గెలిచిన కెప్టెన్ దాదాపు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అయితే మ్యాచులో వర్షం అడ్డంకిగా మారనున్న తరుణంగా బ్యాటింగ్ కూడా ఎంచుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఈ మ్యాచులో బుమ్రా ఆడనున్నాడు. తనకు కొడుకు పుట్టడం వల్ల నేపాల్‌తో మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ఈ సూపర్ మ్యాచ్‌కు అతను తిరిగి జట్టులో చేరాడు. స్పిన్ కు ఉపయోగపడే పిచ్ పై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని తెలుస్తోంది. జడేజా, కుల్‌దీప్‌లకు తోడుగా మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌నూ బరిలోకి దించే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్ కోసం ఇషాన్ కిషన్ ను పక్కన పెడతారని సమాచారం.
తుది జట్లు
టీమిండియా (అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్.
పాకిస్థాన్: ఇమాముల్, జమాన్, బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్, షాదాబ్, ఫహీమ్ అష్రాఫ్, షహీన్, రవూఫ్, నసీమ్.