ఆ ఒక్కడి వల్లే.. రోహిత్ ఈ స్థాయిలో ఉన్నాడు: గౌతం గంభీర్‌

ఆ ఒక్కడి వల్లే.. రోహిత్ ఈ స్థాయిలో ఉన్నాడు: గౌతం గంభీర్‌

ఆఫ్‌ స్పిన్నర్‌గా క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టి బ్యాటర్‌గా .. భారత జట్టు కెప్టెన్‌గా చెరగని ముద్ర వేసుకున్న రోహిత్ శర్మ గురుంచి అందరకీ విదితమే. మరి అతను ఎదుర్కొన్న కష్టాలు గురుంచి, అతని విజయం వెనుకున్న వ్యక్తి గురుంచి  ఎవరికైనా విదితమా! ఎవరికీ తెలియవు.

ఫామ్ కోల్పయి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో అతనిలో నమ్మకాన్ని కలిగించిన ఏకైక వ్యక్తి.. మహేంద్ర సింగ్ ధోని. ఎక్కడో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే రోహిత్‌కు ఓపెనర్‌గా అవకాశం కల్పించి నేడు ఈ స్థాయికి చేర్చాడు. ఈ క్రమంలో అతని విజయానికి కారణమైన వ్యక్తి గురుంచి గౌతమ్‌ గంభీర్ ప్రపంచానికి తెలియజేశాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ వల్లే రోహిత్‌  ఇంత గొప్ప ప్లేయర్‌గా ఎదిగాడని తెలిపాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్.. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడని చెప్పుకొచ్చాడు.

"ప్రతిభను గుర్తించడంలో, ప్రోత్సహించడంలో ధోనీ స్టైలే వేరు. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ రోహిత్‌కు ధోని అండగా నిలిచాడు. అందువల్లే ఇప్పుడు మనం రోహిత్‌లో ఇంతటి విధ్వంసక ఆటగాడిని చూడగలుగుతున్నాం.." అని గంభీర్ తెలిపాడు.

2007 టీ20 ప్రపంచ కప్‌ సమయంలో ధోనీ కెప్టెన్సీలో రోహిత్ ఆడిన విషయం తెలిసిందే. అయితే అప్పటివరకు మిడిలార్డర్‌ లో ఆడే రోహిత్.. ఆ తర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొంది జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.