భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఆకాశాన్ని దాటేస్తుంది. ఈ మ్యాచ్ అభిమానులకి ఎంత కిక్ ఇస్తుందో ఈ మ్యాచ్ చూడడానికి ఎంతమంది ఆతృత్తగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అభిమానులకి కిక్ ఇస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం కొలంబో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించింది. వర్ష సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ALSO READ :తల్లి దీవెన ముందు విధి ఓడిన వేళ..లబుషేన్ గ్రేట్ ఇన్నింగ్స్ వెనుక మిస్టరీ
షెడ్యూల్ ప్రకారం సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈ ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచుకు కూడా వర్షం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ మాత్రమే చేయగా.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు ఈ కారణంగా మరోసారి ఈ దాయాదుల పోరుని వరుణుడు అడ్డుకుంటే ఈ టోర్నీకి కళ తప్పనుంది. వర్షాల నేపథ్యంలో సూపర్-4 మ్యాచ్‌ల వేదికను హంబన్‌టోటకు మార్చాలని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ప్రతిపాదించినప్పటికీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ మ్యాచ్ సాధ్యపడకపోతే ఏసీసీ పై విమర్శలు తప్పవు. అందుకే రిజర్వ్ డే ని ప్రకటించారు.