మెగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేడే ఇండియా-పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢీ

మెగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..  ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేడే ఇండియా-పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢీ
  • నాలుగేండ్ల తర్వాత దాయాదుల వన్డే పోరు
  • మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన ముప్పు
  • మ. 3 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో

క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిస్టరీలో అతి పెద్ద సమరం మళ్లొచ్చింది. నాలుగేండ్ల గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఢీకొట్టబోతున్నాయి.  శ్రీలంక గడ్డపై ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా 
ఈ మెగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేడే జరగనుంది.  ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పడగొట్టి టోర్నీలో బోణీ కొట్టాలని రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన ఆశిస్తోంది. పోయినేడాది టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన టోర్నీలో ఆ టీమ్​ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఇంకోవైపు తమ తొలి పోరులో నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించిన బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన అదే ఊపును ఇండియాపైనా కొనసాగించాలని ఆశిస్తోంది. ఈ మెగా మ్యాచ్​ కోసం ఇరు దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్​ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసక్తిగాఎదురు చూస్తుండగా.. ఆటకు వాన ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది..!


పల్లెకెలె:   

పోయినేడాది టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియాను గెలిపించిన క్షణాలు ఇంకా కండ్ల ముందు కనిపిస్తుండగానే  దాయాది దేశాలు మరోసారి గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమీతుమీకి రెడీ అయ్యాయి. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–ఎలో భాగంగా శనివారం జరిగే  హైఓల్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ పడనున్నాయి. 2019 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇరు జట్ల మధ్య ఇదే మొదటి వన్డే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం మరింత ఆసక్తిని పెంచింది. వచ్చే నెలలో  వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంగిట ఈ మెగా ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరు జట్లకు రిహార్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుంది. ఈసారి వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు జట్లు పోటీ పడుతుండగా.. ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఈ పోరు కోసమే వేచి చూస్తున్నారు. గతేడాది టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరులో షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖుషీ అవ్వగా.. హరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవూఫ్​ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ  రెండు క్లాసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్సర్లు.. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్టరీ తర్వాత భావోద్వేగ సంబరాలు ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మదిలో నిలిచిపోయాయి. అలాంటి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోనే ప్లేయర్లు లెజెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతారు. ఇప్పుడు ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరులోనూ తమ జట్టును గెలిపించి హీరోలు అయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వదులుకోకూడదని ఇరు జట్ల ఆటగాళ్లు భావిస్తున్నారు.

ఈ ముగ్గురు... ఆ ముగ్గురు

ఇండో–-పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనగానే రెండు జట్ల ఆటగాళ్లలో ఎక్కడాలేని ఎనర్జీ వస్తుంది. ఏ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలా ఆడినా.. ఈ పోరులో మాత్రం సత్తా చాటాలన్న కృత నిశ్చయంతో ఉంటారు. ప్రస్తుతం ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, అతని బాటలో ఉన్న శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ ముగ్గురికి పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రయం షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రవూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నసీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా నుంచి  సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదురవనుంది. మరీ ముఖ్యంగా వర్ష సూచన నేపథ్యంలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నసీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3 బ్యాటర్లు ఎలా కాచుకుంటారనేది కీలకం కానుంది.

ఇరు జట్లకూ మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలు 

ఒకవేళ ఇండియా టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తడబడితే మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కీలక బాధ్యత ఉండనుంది. ముఖ్యంగా గాయం నుంచి కోలుకొని వచ్చిన అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అందరి ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు దూరం అవ్వడంతో లెఫ్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనున్నాడు. కానీ, తను నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తాడా? ఐదో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడతాడా? అన్నది చూడాలి.   వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా, స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడేజా ఇటు లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కీలకం కానున్నారు. మరోవైపు 2019 తర్వాత ఇండియాతో పోలిస్తే దాదాపు సగం వన్డేలు మాత్రమే ఆడిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఎక్కువ ఆధారపడుతోంది. బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇమామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణిస్తుండగా.. నాలుగు, ఆరో స్థానాల్లో ఆ జట్టులో సమస్యలున్నాయి. అయితే నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముందుగా వచ్చిన ఇఫ్తికార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుపు సెంచరీతో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నింపారు. 

ఇండియాకు బుమ్రా ‘బూస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’

గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా రీఎంట్రీతో ఇండియా పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలం పెరిగింది. ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. అయితే, వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తను ఎలా ఆడతాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతనికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షమీని కూడా తీసుకునే చాన్సుంది. హైదరాబాదీ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. నాలుగో పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యాతో  మన పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బలంగా ఉంది. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జడేజాకు తోడు చైనామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్ తుదిజట్టులో ఉండే చాన్సుంది. మరి, జోరుమీదున్న బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్​ కోను బౌలర్లు  ఎలా అడ్డుకుంటారో చూడాలి.