పసికూన నేపాల్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. నేపాల్ ముందు 343 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించిన పాక్.. బౌలింగ్‌లోనూ ఇరగదీస్తోంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే పాక్ స్పీడ్ స్టర్ షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీయగా, ఆ మరుసటి ఓవర్ లో నసీం షా .. మరో వికెట్ తీశాడు. దీంతో నేపాల్ తొలి రెండు ఓవర్లలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది.
అఫ్రిది ధాటికి కుశాల్ భుర్టెల్(8) పరుగులకే వెనుదిరగగా.. ఆ మరుసటి బంతికే నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్(0) ఖాతా తెరువకుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం నసీం షా రెండో ఓవర్‌లో.. ఆసిఫ్ షేక్(5) కూడా ఔట్ అవ్వడంతో ఆరంభంలోనే కష్టాల్లో పడింది. కాగా, అంతకుముందు బాబర్ ఆజాం(151), ఇఫ్తికర్ అహ్మద్(109) రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 342 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Lightning strikes twice as Shaheen Afridi sends two Nepalese batters back to the pavilion in the first over.
— CricTracker (@Cricketracker) August 30, 2023
?: Disney+Hotstar pic.twitter.com/ekQctcDXJP
Shaheen Afridi and Haris Rauf are causing havoc in Multan!
— CricTracker (@Cricketracker) August 30, 2023
For live score: https://t.co/un0sBll2x2
?: Disney + Hotstar pic.twitter.com/EBc2YdXDbx