ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడారు. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతికి విజయాన్ని అప్పగించారు. విజయానికి 254 బంతుల్లో 252 పరుగులు.. కాపాడుకునే టార్గెట్ ముందున్నా.. పేలవ ఆటతీరుతో టోర్నీ నుండి నిష్క్రమించారు. ఈ ఓటమి పాక్ ఆటగాళ్లను స్వదేశంలో తలెత్తుకోనివ్వడకుండా చేస్తోంది.
టోర్నీ నుండి నిష్క్రమించడంతో పాకిస్తాన్ క్రికెటర్లు, సిబ్బంది స్వదేశానికి చేరుకున్నారు. కాకపోతే వారికి మునుపటిలా ఎలాంటి స్వాగతాలు లభించలేదు. గెలిస్తే.. క్రికెటర్ల మెడలో దండలు, ఊరేగింపులు, ఎయిర్ పోర్టు పరిసరాల్లో బాణాసంచా పేల్చడాలు, అబ్బో పెద్ద కోలాహలమే కనిపించేది. కానీ ఈసారి అలాంటివేవీ కనిపించలేదు. గుట్టుచప్పుడు కాకుండా క్రికెటర్లు తలోదారిలో వెళ్లిపోయారు. అక్కడ మీడియా హంగామా కూడా పెద్దగా లేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
This broke my heart ?? #AsiaCup2023 pic.twitter.com/SZTmu2mHLo
— Farid Khan (@_FaridKhan) September 16, 2023
ఆఖరి బంతికి విజయం
శ్రీలంక చేతిలో పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కుదించారు. ఈ 42 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి బాబర్ సేన 252 పరుగులు చేసింది. ఈ క్రమంలో అంపైర్లు.. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం శ్రీలంకకు 42 ఓవర్లలో శ్రీలంక 252 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు.అనంతరం లక్ష్య ఛేదనలో లంకేయులు ఆఖరి బంతికి విజయాన్ని అందుకున్నారు.
స్కోర్లు:
పాకిస్తాన్: 252/7 (42 ఓవర్లు)
శ్రీలంక: 252/8 (42 ఓవర్లు)