ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023లో తొలి పోరు మొదలైంది. ముల్తాన్ వేదికగా నేపాల్, పాకిస్తాన్ జట్లు అమీ తుమీ తేల్చుకున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో నేపాల్ బౌలింగ్ చేయనుంది.
తుది జట్లు:
పాకిస్తాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్.
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), ఆరిఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్సన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి.
? TOSS UPDATE ?
— Cricket Pakistan (@cricketpakcompk) August 30, 2023
Pakistan won the toss and chose to bat first#AsiaCup23 #PAKvsNEP pic.twitter.com/xRYZHz1aHy
నేపాల్‌కు భారత అభిమానుల మద్దతు
ఈ మ్యాచ్‌లో నేపాల్ విజయం సాధించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అది జరగడమన్నది దాదాపు అసాధ్యం. సొంతగడ్డపై పాకిస్తాన్ ను ఓడించడం అంత సులువైన పని కాదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 300 పరుగుల పైచిలుకు లక్ష్యాన్నే నేపాల్ ముందుంచనుంది.
And me ??? pic.twitter.com/V32WBL93g5
— Gauravgupta (@Gauravg2152) August 30, 2023