రోహిత్‌‌కు కోపం వస్తే ఇలానే ఉంటది: వేళ్లపై లెక్కలేసి ఎలా చెప్పాడో చూడండి

రోహిత్‌‌కు కోపం వస్తే ఇలానే ఉంటది: వేళ్లపై లెక్కలేసి ఎలా చెప్పాడో చూడండి

ఆసియా కప్ 2023లో తలపడే భారత జట్టును బీసీసీఐ సోమవారం(ఆగష్టు 21) ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లతో కూడిన 17 మంది సభ్యుల సమిష్ట జట్టును ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసింది. ఈ ప్రకటన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయారు. కాదు.. కాదు.. మీడియా మిత్రులే అతన్ని కోప్పడేలా చేశారు. 

4వ స్థానంలో ఎవరు?

టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి భారత జట్టును వేధిస్తోన్న ఒకే ఒక స్థానం.. నాలుగు. ఎందరో అటగాళ్లు జట్టులోకి వస్తున్నారు.. పోతున్నారు కానీ, ఏ ఒక్కరూ స్థిరంగా ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. ఈ విషయంపై మీడియా మిత్రులు మరోసారి రోహిత్‌ను ప్రశ్నించగా.. అతను అదిరిపోయే సమాధానమిచ్చారు.

ఒకటి కాదు.. అన్నీ ముఖ్యమే

నాల్గవ స్థానంలో బ్యాటింగ్  చేసేదెవరు..? అయ్యర్ లేదా సూర్య లేదా తిలక్ వర్మ అని ప్రశ్నకు రోహిత్.. చేతి వేళ్ళపై లెక్కలేసి మరీ సమాధానం చెప్పాడు. "ఒక్క స్థానం గురించి కాదు.. జట్టులో అన్ని స్థానాలు ముఖ్యమే. గాయాల సమస్య ఉంది. అలాంటప్పుడు మిగిలిన ఆటగాళ్లు వర్క్ లోడ్ భరించాలి. ఎవరు ఏ స్థానంలో ఆడతారన్నది సిచ్యువేషన్‌ని బట్టి మారుతుంది. అందరకీ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము.." అని హిట్ మ్యాన్ బదులిచ్చారు.

ఆసియా కప్ 2023కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, షమీ శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ.

రిజర్వ్ ప్లేయర్: సంజు శాంసన్