దుబాయ్‌లో ఇండియా - పాక్ మ్యాచ్ ఫీవర్.. భారీ ఏర్పాట్లతో హైఓల్టేజ్

దుబాయ్‌లో ఇండియా - పాక్ మ్యాచ్ ఫీవర్.. భారీ ఏర్పాట్లతో హైఓల్టేజ్

ఇండియా vs పాకిస్తాన్.. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు అందరి కళ్లు దానిమీదే నిలుస్తాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు ఓడినా.. ఆ దేశ అభిమానులకు నిరాశే. గెలిచిన దేశంలో బాణసంచా వెలుగులు మిరిమిట్లు గొలుపుతుంటే.. ఓడిన దేశంలో ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అలాంటి సన్నివేశాలు మనముందు కనిపించడానికి గంటల సమయం మాత్రమే మిగిలివుంది. 

ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 2న లంక గడ్డపై చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. ఈ క్రమంలో దుబాయ్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడలేని వారికి.. అలాంటి అనుభూతి కలిగించేందుకు రెస్టారెంట్ యాజమాన్యాలు సరికొత్త ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పెద్ద పెద్ద స్క్రీన్లతో పాటు మంచి మంచి డీల్స్ అందిస్తున్నాయి. ఓ రెస్టారెంట్ అయితే.. మ్యాచ్ జరిగే సమయం మొత్తానికి లిక్కర్‌పై 50 శాతం డిస్కొంట్ ఇవ్వగా.. మరో రెస్టారెంట్ 200 సెంటీమీటర్ల అతి పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసింది.

తాజ్ జుమేరా లేక్స్

దుబాయ్‌లో తాజ్ జుమేరా లేక్స్ ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కుటుంబసమేతంగా ఓ నాలుగు గంటలు గడపాలనుకుంటే అక్కడకి వెళ్లిపోవచ్చు. ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో తాజ్ జుమేరాను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అలాగే, డ్రింక్స్ పై 50 శాతం తగ్గింపుతో పాటు మంచి మ్యాచ్-అవర్ డీల్స్ అందిస్తున్నారు. 


బెస్ట్ డీల్(Dh 99): 99 దినార్లకు ఎంట్రీ టికెట్ ఇస్తూ.. మ్యాచ్ జరిగే సమయం మొత్తానికి లిక్కర్ పై 50 శాతం డిస్కొంట్.. అదే విధంగా ఫుడ్ పై 40 శాతం డిస్కొంట్ అనౌన్స్ చేసింది.

ఫ్లయింగ్ క్యాచ్

ఇండియా- పాక్ ఐకానిక్ గేమ్‌ చూడడానికి ఉత్తమమైన ప్రదేశం ఇది. స్పోర్ట్స్ రెస్టారెంట్‌గా పేరొందిన ఫ్లయింగ్ క్యాచ్ లో 6 ఎల్ ఈడి స్క్రీన్‌లు మరియు ఒకటి భారీ 200సె.మీ. జెయింట్ స్క్రీన్ ఉన్నాయి. రుచికరమైన డెజర్ట్‌లపై 20 శాతం తగ్గింపుతో పాటు మంచి బాంక్వెట్ డీల్స్ అందిస్తోంది.

బెస్ట్ డీల్(Dh 149): 149 దినార్లకు మూడు గంటలకు వెజ్ అండ్ నాన్ వెజ్ స్ట్రార్టర్లతోపాటు రెండు మాక్ టైల్స్ ఫ్రీ ఆఫర్ ప్రకటించింది.

హెడ్‌లైన్స్ గార్డెన్

ఇండియా- పాక్ మ్యాచ్ ను మంచి ఓపెన్ ప్లేస్ లో చూడాలనుకుంటే.. అల్ మినాలోని మెర్క్యూర్ గోల్డ్ హోటల్‌లోని రూఫ్‌టాప్‌కు వెళ్లండి. వెళ్ళేటపుడు.. మీ స్నేహితులను వెంట తీసుకెళ్లి ఆఫర్‌ను పొందవచ్చు. ఫుడ్ పై మంచి ప్యాకేజీలను అందిస్తున్నారు.

హడిల్

దాయాదుల సమరాన్ని నలుగురితో కలిసి చూడటానికి హడిల్ కూడా బెస్ట్ ప్లేస్. ఆటతో పాటు రుచికరమైన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయవచ్చు.