ఫలితాన్ని మార్చేసిన ఒకే ఒక్క బంతి: కంటతడి పెట్టిన ఆఫ్ఘన్ క్రికెటర్లు

ఫలితాన్ని మార్చేసిన ఒకే ఒక్క బంతి: కంటతడి పెట్టిన ఆఫ్ఘన్ క్రికెటర్లు

ఆతిథ్య శ్రీ‌లంకతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు.. విజయపు అంచుల వరకు వచ్చి ఓడారు. ఒకే ఒక్క బంతి ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని దూరం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 291 పరుగులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 2 పరుగుల దూరంలోనిలిచిపోయింది.

వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నీలో సూపర్-4కు అర్హత సాధించేలంటే.. 292 పరుగుల లక్ష్యాన్ని 37.2 ఓవర్లలోపే ఛేదించాలి. అంటే.. 37 ఓవర్ల ఒక బంతి ముగిసేసరికి మ్యాచ్ ముగించాలన్నమాట. అనుకున్నట్లుగానే 37 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆఫ్ఘన్ జట్టు 289 పరుగులు వద్ద నిలిచింది. తదుపరి బంతికి మూడు పరుగులు వస్తే.. వారు సూపర్-4కు అర్హత సాధిస్తారు. అటువంటి ఉత్కంఠ సమయంలో ఆ బంతికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు వికెట్ కోల్పోయింది. అదే ఓవర్ ఇదో బంతికి తదుపరి బ్యాటర్ కూడా ఔట్ అవ్వడంతో విజయం కూడా దూరమైంది.

కంటతడి పెట్టిన ఆఫ్ఘన్ క్రికెటర్లు

 ఒకే ఒక బంతి వారి కలల ప్త్రపంచాన్ని దూరం చేయడం అఫ్గాన్ క్రికెటర్లు జీజీర్ణించుకోలేకపోయారు. తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. వేలాది మంది ప్రేక్షకుల నడుమ కంటతడి పెట్టారు. ఆ దృశ్యాలను చూసి అంభిమానులు కంటతడి పెట్టాల్సి వచ్చింది. రషీద్ ఖాన్, గుల్బుద్దీన్ నయిబ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. ఇలా పలువురు క్రికెటర్ల కళ్లలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీ‌లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 291 ప‌రుగులు చేసింది. కుశాల్ మెండిస్(92 : 84బంతుల్లో 6 ఫోర్ల‌, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. ఓవైపు వికెట్లు ప‌డుతున్నా అత‌ను ఓపిక‌గా ఆడి జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. టాపార్డ‌ర్‌లో ఓపెన‌ర్ ప్ర‌థుమ్ నిస్సంక‌(41) ప‌రుగుల‌తో రాణించాడు. అయితే.. చివ‌ర్లో దునిత్ వెల్ల‌లాగే(33 నాటౌట్), మ‌హీశ్ థీక్ష‌ణ‌(28) ధ‌నాధ‌న్ ఆడడంతో లంక భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది.

ఆఫ్ఘన్ జట్టుకు ప్రాణం పోసిన నబీ

లక్ష్య ఛేదనలో వెనుకబడ్డ ఆఫ్ఘనిస్తాన్ కు ఆ జట్టు ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ విధ్వంసకర ఇన్నింగ్స్ తో ప్రాణం పోశాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి.. జట్టును విజయపు అంచుల వరకు తీసుకొచ్చాడు. అయితే అనుభవం, సొంతగడ్డపై ఆడుతుండటం లంకేయులకు కలిసొచ్చింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్-4కు అర్హత సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుండి నిష్క్రమించింది.