ఆసియాకప్ 2023 ఫైనల్‍లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి లంక బ్యాటర్లను దెబ్బకొట్టిన హైదరాబాదీ.. మొత్తంగా 6 వికెట్లతో సత్తాచాటి శ్రీలంక ఓటమిని శాసించాడు. ఈ టోలీచౌకీ బిడ్డ విజృంభణ ముందు లంక ఆటగాళ్లు తలవంచక తప్పలేదు. దీంతో లంకేయులతో జరిగిన ఫైనల్‍లో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది.
ఈ ప్రదర్శనతో మ్యాచ్ గెలిచిన అతను.. తనకు దక్కిన 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ప్రైజ్‌మనీని మైదాన సిబ్బందికి ఇచ్చి శభాష్ అనిపించాడు. ప్రైజ్‌మనీగా సిరాజ్‌కు అందిన 5వేల అమెరికన్ డాలర్లు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 4 లక్షలు) ప్రేమదాస స్టేడియం సిబ్బందికి ఇస్తున్నట్టు అతను ప్రకటించాడు. అతని ప్రదర్శన, మంచి మనసుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలుగు దర్శకధీరుడు రాజమౌళి సిరాజ్ తనదైన శైలిలో మెచ్చుకున్నారు.
Announcing this as Siraj's fanpage ?#INDvSL #AsiaCup2023 Final live now only on #DisneyPlusHotstar, free on the mobile app.#FreeMeinDekhteJaao #AsiaCupOnHotstar #Cricket pic.twitter.com/mSJvXpK8BK
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 17, 2023
Also Read :- Asia Cup 2023 Final: సిరాజ్ పాంచ్ పటాకా.. క్రికెట్‌లో సరికొత్త చరిత్ర
"సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లతో మెరిశాడు. శభాష్. అతని బౌలింగ్‌లో అతనే బౌండరీ ఆపడానికి లాంగ్-ఆన్‌కి పరిగెటత్తాడంటే అతనికి చాలా విశాలమైన మనసుంది.." అని జక్కన్న చమత్కరిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరలవుతోంది.
Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets…????????????
— rajamouli ss (@ssrajamouli) September 17, 2023
And has a big heart, running to long-on to stop the boundary off his own bowling… ???
Mohammad Siraj ran to the boundary to stop four on his own bowling, Virat Kohli, Shubman Gill and Hardik Pandaya couldn't control their emotions while seeing this. The dedication ?? #AsiaCupFinal #INDvSL pic.twitter.com/v6PnDJ9XFD
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) September 17, 2023