ఉత్కంఠకు తెరపడింది. ఆసియన్ కంట్రీస్ మధ్య జరిగే ఆసియా కప్-2023 టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను బీసీసీఐ సెకట్రరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆగస్ట్ 30న ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ.. సెప్టెంబర్ 17న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
ఈ మెగా టోర్నీలో మొత్తం 13 మ్యాచులు జరగనుండగా.. పాక్ గడ్డపై 4, శ్రీలంక గడ్డపై 9 నిర్వహించనున్నారు. పాకిస్తాన్ మ్యాచులు.. వారి సొంతగడ్డపై జరగనుండగా.. భారత జట్టు ఆడబోయే మ్యాచులను శ్రీలంక వేదికగా జరగనున్నాయి. అయితే, ఈ టోర్నీలో కీలక మ్యాచ్, దాయాదుల సమరం(ఇండియా vs పాకిస్తాన్) సెప్టెంబర్ 2న జరగనుంది. క్యాండీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
గ్రూప్–ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ జట్లు ఉండగా.. గ్రూప్–బిలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్ దశలో మొత్తం 6 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్–4కు అర్హత సాధిస్తాయి. అనంతరం నాకౌట్ సమరం మొదలుకానుంది. సెప్టెంబర్ 17న కొలంబో వేదికగా జరిగే ఫైనల్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరపడనుంది.
ఆసియా కప్ 2023 షెడ్యూల్
- 30 ఆగస్ట్: పాకిస్తాన్ vs నేపాల్, ముల్తాన్ (పాకిస్తాన్)
- 31 ఆగస్ట్: బంగ్లాదేశ్ vs శ్రీలంక, కాండీ (శ్రీలంక)
- 2 సెప్టెంబర్: ఇండియా vs పాకిస్తాన్, కాండీ (శ్రీలంక)
- 3 సెప్టెంబర్: బంగ్లాదేశ్ vs అఫ్ఘనిస్తాన్, లాహోర్ (పాకిస్తాన్)
- 4 సెప్టెంబర్: ఇండియా vs నేపాల్ క్యాండీ (శ్రీలంక)
- 5 సెప్టెంబర్: అఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక లాహోర్ (పాకిస్తాన్)
- 6 సెప్టెంబర్: A1 v B2, లాహోర్ (పాకిస్తాన్)
- 9 సెప్టెంబర్: B1 v B2, కొలంబో (శ్రీలంక)
- 10 సెప్టెంబర్: A1 v A2, కొలంబో (శ్రీలంక)
- 12 సెప్టెంబర్: A2 v B1, కొలంబో (శ్రీలంక)
- 14 సెప్టెంబర్: A1 v B1, కొలంబో (శ్రీలంక)
- 15 సెప్టెంబర్ A2 v B2, కొలంబో (శ్రీలంక)
- 17 సెప్టెంబర్: ఫైనల్ మ్యాచ్, కొలంబో (శ్రీలంక)
I am happy to announce the schedule for the highly anticipated Men's ODI #AsiaCup2023, a symbol of unity and togetherness binding diverse nations together! Let's join hands in the celebration of cricketing excellence and cherish the bonds that connect us all. @ACCMedia1 pic.twitter.com/9uPgx6intP
— Jay Shah (@JayShah) July 19, 2023
వన్డే వరల్డ్ కప్ 2023ని దృష్టిలో ఉంచుకొని.. ఈసారి టోర్నీని వన్డే ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు.