అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 2వ తేదీన చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరగనుంది. హై వోల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఆసియాప్ చరిత్రలో భారత్ పాక్ రికార్డులు ఎలా ఉన్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లలో ఏ జట్టుది పై చేయి..JUST LOOK..
ఆసియా కప్ 1984లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ టోర్నీ 15 సార్లు జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 16వది కావడం గమనార్హం. ఆసియా కప్ లో క్రికెట్ ఆడే అన్ని ఆసియా దేశాలు పాల్గొన్నా.. అందరి దృష్టి మాత్రం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ల మీదే ఉంటుంది. దాయాది దేశాల మ ్యాచ్ అంటే వచ్చే మజానే వేరు. ఈ క్రమంలోనే శనివారం(సెప్టెంబరు 2) నాడు ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి సమరానికి సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల రికార్డులు ఒకసారి పరిశీలిద్దాం..
ALSO READ:ఎల్‌నినో ఎఫెక్ట్.. 1901 తరువాత అత్యంత పొడిగా ఆగస్టు
టీమిండియాదే పైచేయి..
సాధారణ మ్యాచుల్లో టీమిండియాపై పాకిస్థాన్ ఆధిపత్యం. కానీ ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రం పాక్ మీద తిరుగులేని రికార్డు భారత్ సొంతం. ఆసియా కప్ లో ఇప్పటివరకు 49 మ్యాచులాడిన టీమిండియా.. 31 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక పాకిస్థాన్ 45 మ్యాచుల్లో 25 విజయాలను సొంతం చేసుకుంది. ఈ లిస్టులో శ్రీలంక ఇప్పటివరకు 34 విజయాలతో టాప్ లో ఉంది.
???? ??? ??????? ?????:-
— Farid Khan (@RealFaridKhan) August 27, 2023
???:- 1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018
???:- 1986, 1997, 2004, 2008,2014, 2022
???:- 2000, 2012#AsiaCup || #AsiaCup2023 #INDvsPAK pic.twitter.com/7QulgUq9Y3
ఇక భారత్- పాకిస్థాన్ ముఖాముఖి పోరులో టీమిండియాదే పై చేయి. ఇరు జట్లు 13 సార్లు తలపడగా భారత్ 7 విజయాలు సాధించగా.. 5 మ్యాచుల్లో పాకిస్థాన్ గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇదిలా ఉండగా.. ఆసియా కప్ లో దాయాది దేశాల మధ్య జరిగిన చివరి 5 మ్యాచుల్లో టీమిండియా నాలుగు సార్లు విజయాన్ని అందుకోవడం విశేషం. గతేడాది టీ 20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ లో మాత్రమే పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది.
వ్యక్తిగత రికార్డులు..
ఆసియాకప్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డు లంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉంది. అతను ఆసియాప్ లో 1220 పరుగులు చేశాడు. బౌలింగ్ లో శ్రీలంక లెజండరీ స్పిన్నర్ మురళీధరన్ 30 వికెట్లతో ఈ లిస్టులో ప్రథమ స్థానంలో నిలిచాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2012 లో చేసిన 183 పరుగులు రికార్డు..ఇప్పటికీ చెక్కు చెరదలేదు. ఆసియాప్ లో ఇదే ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా కొనసాగుతోంది.
కాగా 2008 లో అజంతా మెండిస్ 13 పరుగులకే 6 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
ఇక భారత్, పాకిస్థాన్ విషయానికి వస్తే.. 1985 లో అకెబ్ జావేద్ 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకోవడం ఇరు జట్ల మధ్య టాప్ స్పెల్. 2012 లో 330 పరుగుల స్కోర్ పాకిస్థాన్ చేయగా టీమిండియా సక్సెస్ ఫుల్ గా ఈ టార్గెట్ ని ఛేజ్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఆసియా కప్ లో ఇరు జట్లకు ఇదే హైయెస్ట్ టీం టోటల్ కాగా.. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ 183 పరుగులతో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.