ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ గెలుపు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక ఆ గెలుపు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారీ తేడాతో వస్తే..? ఆ కిక్కే వేరు. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా నిన్న పాకిస్థాన్ పై జరిగిన మ్యాచులో టీమిండియా ఏకంగా 228 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అభిమానుల ఆనదానికి అవధులు లేకుండా పోయింది. రకరకాలుగా సంబరాలు చేసుకుంటూ భారత జట్టుకి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసారంటే..?
సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన సందర్భంగా కొలంబోలోని భారత క్రికెట్ అభిమానులు గదర్ సినిమాలోని 'మెయిన్ నిక్లా గడ్డి లేకే' పాటను పాడి 'భారత్ మాతా కీ జై', 'వందేమాతరం' అంటూ నినాదాలు చేశారు. ఇక నాసిక్ లో అభిమానులు అయితే పటాకులు భారీ స్టాయిలో పేల్చి టీమిండియాకు జేజేలు కొట్టారు.
గుజరాత్ ఫ్యాన్స్ వీధుల్లో గుమిగూడి టీమ్ ఇండియాను సపోర్ట్ ఛేస్తూ కనిపించారు. ఈ విజయాన్ని కోల్ కత్తా ఫ్యాన్స్ సిలిగురిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.మొరాదాబాద్‌లోని ఫ్యాన్స్ భారత జెండాలు పట్టుకొని ఊరేగారు. ఇక కొన్నిచోట్లయితే బాణ సంచా కాలుస్తూ కేరింతలు కొట్టేశారు.
ఇక ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో కదం తొక్కగా.. ఓపెనర్లు శుభమాన్ గిల్, రోహిత్ శర్మ అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.
Massive celebrations of India's win over Pakistan in Ichalkaranji, Maharashtra. pic.twitter.com/3GljtmwVkd
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2023