ఆసియా ఖండంలోనే అతిపెద్ద హైపర్​ లూప్​ ట్యూబ్

ఆసియా ఖండంలోనే అతిపెద్ద  హైపర్​ లూప్​ ట్యూబ్

హైపర్​లూప్​ టెక్నాలజీ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్​ ఐఐటీ తైయూర్​ క్యాంపస్​లో 425 మీటర్ల పొడవైన హైపర్​లూప్​ ట్యూబును నిర్మించారు. 

    సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్ద ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో వెళ్లలేవు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్​లూప్​ ట్యూబ్​లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగం బాగా పెరుగుతుంది. ఈ పరిశోధనకు భారతీయ రైల్వే, ఎల్​ అండ్​ టీ సంస్థలు నిధులు అందిస్తున్నాయి. 
    తక్కువ గాలి పీడనం ఉండటం, అయస్కాంత బలం తోడు కావడం వల్ల హైపర్​లూప్​ బోగీ గంటకు దాదాపు 500–600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ ప్రయోగం విజయవంతమయ్యాక హైపర్​లూప్​ బోగీలో సరుకులను రవాణా చేసి పరిశీలిస్తారు. అది కూడా సఫలమైతే చివరగా హైపర్​లూర్​ బోగీల్లో మనుషులను కూర్చోబెట్టి ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇది ఆచరణలోకి వస్తే చెన్నై నుంచి బెంగళూరుకు 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.