ఏఎఫ్‌‌‌‌ఐ ప్రెసిడెంట్‌‌‌‌గా బహదూర్‌‌‌‌ సింగ్‌‌‌‌  

ఏఎఫ్‌‌‌‌ఐ ప్రెసిడెంట్‌‌‌‌గా బహదూర్‌‌‌‌ సింగ్‌‌‌‌  

చండీగఢ్‌‌‌‌ : ఆసియా గేమ్స్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌, షాట్‌‌‌‌పుట్‌‌‌‌ మాజీ ప్లేయర్‌‌‌‌ బహదూర్‌‌‌‌ సింగ్‌‌‌‌ సాగూ.. అథ్లెటిక్స్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఏఎఫ్‌‌‌‌ఐ) నూతన ప్రెసిడెంట్‌‌‌‌గా ఎన్నికయ్యారు. సీనియర్‌‌‌‌ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ అంజూ బాబీ జార్జ్‌‌‌‌ వ్యక్తిగత కారణాలతో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో బహదూర్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఎంపిక ఏకగ్రీవమైంది. రెండు రోజుల పాటు జరిగిన ఏఎఫ్‌‌‌‌ఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో బహదూర్‌‌‌‌ ఎంపికతో పాటు మిగతా కార్యవర్గాన్ని ఖరారు చేశారు. 2025 నుంచి 2029 వరకు బహదూర్‌‌‌‌ ఈ పదవిలో కొనసాగుతారు.

2002 బుసాన్ ఆసియా గేమ్స్‌‌‌‌లో స్వర్ణం సాధించిన ఆయన 2000, 2004 ఒలింపిక్స్‌‌‌‌లోనూ బరిలోకి దిగారు. ఏఎఫ్‌‌‌‌ఐ అథ్లెట్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌లో మెంబర్‌‌‌‌గానూ పని చేస్తున్నారు. అంజూ మరోసారి సీనియర్‌‌‌‌ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌గా సేవలందించనుంది. సెక్రటరీగా సందీప్‌‌‌‌ మెహతా,  వైస్‌‌‌‌ ప్రెసిడెంట్స్‌‌‌‌గా అబు మెహతా, జయంతా మల్లా బుర్హా, ఏకే శర్మ, ట్రెజరర్‌‌‌‌గా స్టాన్లీ జోన్స్‌‌‌‌ను ఎన్నుకున్నారు.