Asian Champions Trophy 2024: హాకీలో భార‌త్ హ‌వా.. వ‌రుస‌గా నాలుగో విజ‌యం

Asian Champions Trophy 2024: హాకీలో భార‌త్ హ‌వా.. వ‌రుస‌గా నాలుగో విజ‌యం

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్‌.. గురువారం(సెప్టెంబర్ 12) మరో విజయాన్ని అందుకుంది. ద‌క్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో విజ‌యం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 

ద‌క్షిణ కొరియా ఏకైక గోల్ 

ద‌క్షిణ కొరియా త‌రుపున జిహున్ యాంగ్ 30వ నిమిషంలో ఏకైక గోల్‌ న‌మోదు చేశాడు. భారత్‌ తరఫున అరైజీత్ సింగ్ (8వ నిమిషం), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (9వ నిమిషం, 43వ నిమిషం) గోల్స్ చేశారు. తద్వారా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 200 గోల్స్ క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన భారత మూడో క్రీడాకారుడు కాగా.. ఓవరాల్ ‌గా అంతర్జాతీయ హాకీలో 200 గోల్స్ పూర్తి చేసిన 12వ ఆటగాడు.

అంతకుముందు భారత్ 3-0తో చైనాను, 5-1తో జపాన్‌ను, 8-1తో మలేసియాను మట్టికరిపించింది. గ్రూపు ద‌శ‌లో భార‌త్ త‌న చివ‌రి మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న శ‌నివారం పాకిస్థాన్‌తో ఆడ‌నుంది. ఆరు జట్లు పోటీపడుతోన్న ఈ టోర్నీ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరుగుతోంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.