న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియా హాకీ టీమ్‌ను బుధవారం ప్రకటించారు. 18 మందితో కూడిన బృందానికి హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఊహించినట్లుగానే మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ స్థానాన్ని క్రిషన్ బహుదుర్ పాఠక్‌తో భర్తీ చేశారు.
పారిస్ ఒలింపిక్స్‌తో పాటు చాలా టోర్నీల్లో పాఠక్ స్టాండ్ బై గోల్ కీపర్‌గా వ్యవహరించాడు. వివేక్ సాగర్ ప్రసాద్‌ను వైస్ కెప్టెన్‌గా తీసుకున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు జరిగే ఈ టోర్నీలో ఇండియా.. కొరియా, మలేసియా, పాకిస్తాన్, జపాన్, చైనాతో తలపడనుంది.