
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్న ఇండియా హాకీ టీమ్ ఫైనల్ బెర్తుపై కన్నేసింది. సోమవారం జరిగే సెమీఫైనల్లో కొరియా పని పట్టేందుకు సిద్ధమైంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా ఈ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం గెలిచిన ఫామ్‌ను ఈ టోర్నీలోనూ కొనసాగిస్తున్న జట్టు ఈ టోర్నీలో ఆడిన ఐదు లీగ్‌లోనూ మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలతో అజేయంగా నాకౌట్‌కు దూసుకొచ్చింది. లీగ్ దశలో ఆడిన మ్యాచ్‌లో 3–1తో కొరియాపై గెలిచిన ఇండియా గత పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 2–1తో పైచేయి సాధించింది. ఫార్వర్డ్, డిఫెన్స్‌లో అద్భుతంగా ఆడుతున్న ఇండియా అదే జోరును కొనసాగిస్తే ఫైనల్ చేరడం పక్కా. మనతో పోలిస్తే కొరియా బలహీనంగా ఉంది. కానీ, ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. కాబట్టి ఆ టీమ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. మరో సెమీస్‌లో చైనాతో పాకిస్తాన్ పోటీపడుతుంది. మంగళవారం ఫైనల్ జరుగుతుంది.