ADB​ నివేదిక : ఇండియాలో పనిచేసే వయసున్న వారెందరు ?

ADB​ నివేదిక : ఇండియాలో పనిచేసే వయసున్న వారెందరు ?

భారతదేశంలో పనిచేయగలిగిన వయస్సు (15 నుంచి 64) కలిగిన జనాభా సంఖ్య 2036కు పెరుగుతుందని ఏషియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్ (ఏడీబీ) నివేదిక పేర్కొన్నది. 2011 నాటికే భారత్​లో 60 శాతం మంది పని వయస్సు జనాభా ఉందని, ఇది 2031 నాటికి 65.1 శాతానికి చేరుతుందని పేర్కొంది. అయితే, 2036 నాటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 64.9 శాతానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో చైనా, జపాన్​ల్లో పని వయస్సు జనాభా తగ్గుముఖం పడుతున్నదని తెలిపింది. 
    పని వయస్సు జనాభా పెరుగుదల కారణంగా శ్రామిక శక్తి వృద్ధి చెందుతుందని, ఆసియా, పసిఫిక్​ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని నివేదిక వివరించింది.  ఆసియా, పసిఫిక్​ ప్రాంతాల్లో వలసలు, మానవ వనరుల మూలధన పెట్టుబడులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. 
    ప్రస్తుతం పలు దేశాల్లో పని వయసు జనాభా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా దేశాలు మరిన్ని విధానాలు అవలంబించాల్సి వస్తున్నదని పేర్కొంది.