ప్రపంచ క్రికెట్లో తమదే గొప్ప బోర్డు, తమ జట్టే అత్యుత్తమ జట్టు అంటూ గంభీరాలు పలికే పాకిస్తాన్ క్రికెట్ కు తగిన శాస్తి జరిగింది. ఆసియా క్రికెట్ క్రీడల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో పాకిస్తాన్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ లో విఫలమైన పాక్ ఆటగాళ్ళు.. అనంతరం బౌలింగ్ లోనూ రాణించలేకపోయారు.
ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 115 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 24 పరుగులు చేసిన ఒమైర్ యూసఫ్ ఆ జట్టులో టాప్ స్కోరర్. అఫ్గాన్ స్పిన్నర్లు, పేసర్లు వేసిన బంతులకు పాకిస్థాన్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీసుకోగా.. కాయిస్ అహ్మద్, జహీర్ ఖాన్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
- ALSO READ | Cricket World Cup 2023: వరల్డ్ కప్ తొలి మ్యాచులోనే టీమిండియాకు బ్యాడ్ న్యూస్ .. అనారోగ్యంతో గిల్ ఔట్
అనంతరం 116 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ బాటర్లు 6 వికెట్లు కోల్పోయి ఛేదించారు. నూర్ అలీ జార్డాన్ 39 పరుగులతో రాణించగా.. గుల్బుద్దీన్ నయిబ్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ జట్టు ఫైనల్ చేరగా.. స్వర్ణం కోసం అక్టోబర్ 7న భారత్ తో తలపడనుంది.