చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. హాంగ్ జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంట్రల్ స్టేడియంలో... భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ లో ఇండియన్ రోవర్లు అర్జున్ లాల్, అరవింద్ సింగ్ టీమ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.
అటు ఉమెన్స్ పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ లో మహులీ ఘెష్, రమితా ఆషి చౌక్సే సిల్వర్ మెడల్ సాధించారు. 19వ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ఇండియన్ ప్లేయర్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి. రోయింగ్ లో ఏకంగా అయిదు విభాగాల్లో భారత అథ్లెట్లు ఫైనల్లో తమ సత్తాను చాటుతున్నారు.
అటు మహిళల క్రికెట్ సెమీస్ లో బంగ్లాదేశ్ తో తలపడిన భారత్..బంగ్లా టీమ్ ను ఓడించి పతకం ఖాయం చేసుకుంది.