ఆసియా క్రీడల క్రికెట్ విభాగంలో బంగ్లాదేశ్ మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. సోమవారం డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ మహిళా జట్టుతో జరిగిన కాంస్య పతక పోరులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి గౌరవప్రదంగా టోర్నీని ముగించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ మహిళా జట్టు.. బంగ్లా బౌలర్ల ధాటికి 64 పరుగులకే కుప్పకూలింది. ముగ్గురు డకౌట్ కాగా, 17 పరుగులు చేసిన అలియా రియాజ్ టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో మారుఫా అక్తర్ 3 ఓవర్లలో కేవలం రెండు పరుగులిచ్చి వికెట్ తీసుకోవడం గమనార్హం. అనంతరం 65 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలివుండగానే చేధించారు. ఈ విజయంతో పాకిస్తాన్ ఒట్టిచేతులతో ఇంటికి పయనమవ్వగా.. బంగ్లాదేశ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
?????????? ??????? ??????????! ?
— Female Cricket (@imfemalecricket) September 25, 2023
Defeating defending champions Pakistan by 5 wickets to clinch the bronze medal at the Asian Games.#CricketTwitter #AsianGames pic.twitter.com/2b6Ne8rrJz