చైనాలోని హాంగ్జౌ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి ఆసియన్ గేమ్స్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఈ పోటీలలో భారత అథ్లెట్లు, ఇతర క్రీడాకారులతో పాటు క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత పురుషుల క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. తాజాగా, ఆసియా క్రీడల మెన్స్, ఉమెన్స్ క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది.
వన్డే వరల్డ్ కప్ 2023 పోరుకు ఎక్కువ సమయం లేనందున బీసీసీఐ.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టును ఈ క్రీడలకు ఎంపిక చేసింది. ఈ టోర్నీలో మహిళల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచే మొదలుకానుండగా.. పురుషుల క్రికెట్ మ్యాచ్ లు ఈనెల 27న మొదలవునున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మ్యాచ్ లన్నీ హాంగ్‌జౌలోని జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరగనున్నాయి.
ఆసియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్:
ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటుండగా.. ఐసీసీ ర్యాంకుల ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం నేపాల్, మంగోలియా, జపాన్, కంబోడియా, మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, మాల్దీవ్స్, హాంకాంగ్, జపాన్‌లు లీగ్ స్టేజ్ లో తలపడనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Dimensions of the Hangzhou cricket stadium in China for Asian Games:
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2023
- 55m shorter side.
- 63-65m square of the wicket.
- 68m down the ground. pic.twitter.com/iYKnFXUcmn
భారత్ తమ తొలి మ్యాచ్ అక్టోబర్ 3న గ్రూప్ - ఎ నుంచి క్వార్టర్స్‌కు అర్హత సాధించే తొలి జట్టుతో ఆడనుంది. అక్టోబర్ 6న రెండు సెమీఫైనల్స్, 7న మూడో స్థానం కోసం జరిగే జట్టు తలపడనుండగా అదే రోజు ఫైనల్ జరగనుంది.
Also Read :- కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్
మెన్స్ క్రికెట్ షెడ్యూల్:
- సెప్టెంబర్ 27: నేపాల్ vs మంగోలియా (గ్రూప్ ఏ)
- సెప్టెంబర్ 28: జపాన్ vs కంబోడియా (గ్రూప్ బి)
- సెప్టెంబర్ 28: మలేషియా vs సింగపూర్ (గ్రూప్ సి)
- సెప్టెంబర్ 28: మంగోలియా vs మాల్ద్వీస్ (గ్రూప్ ఏ),
- సెప్టెంబర్ 29: కాంబోడియా vs హాంకాంగ్ (గ్రూప్ బి)
- సెప్టెంబర్ 29 : సింగపూర్ vs థాయిలాండ్ (గ్రూప్ సి)
- అక్టోబర్ 1: మాల్దీవులు vs నేపాల్ (గ్రూప్ ఏ)
- అక్టోబర్ 1: హాంకాంగ్ vs జపాన్ (గ్రూప్ బి)
- అక్టోబర్ 2: థాయిలాండ్ vs మలేషియా (గ్రూప్ సి)
- అక్టోబర్ 3: ఇండియా vs QF 1
- అక్టోబర్ 3: పాకిస్తాన్ vs QF 2
- అక్టోబర్ 4: శ్రీలంక vs QF 3
- అక్టోబర్ 4: బంగ్లాదేశ్ vs QF 4
- అక్టోబర్ 6(మొదటి సెమీ ఫైనల్): QF1 విజేత vs QF4 విజేత
- అక్టోబర్ 6(రెండవ సెమీ ఫైనల్): QF2 విజేత vs QF3 విజేత
- అక్టోబర్ 7(మూడు, నాలుగు స్థానాల కొరకు): SF 1 లూజర్ vs SF 2 లూజర్
- అక్టోబర్ 7(ఫైనల్): SF 1 విజేత vs SF 2 విజేత
మహిళల క్రికెట్ షెడ్యూల్:
- సెప్టెంబర్ 19: ఇండోనేషియా vs మంగోలియా (గ్రూప్ ఏ)
- సెప్టెంబర్ 19: హాంకాంగ్ vs మలేషియా (గ్రూప్ బి)
- సెప్టెంబర్ 20: మొదటి మ్యాచ్ లూజర్ vs రెండవ మ్యాచ్ లూజర్
- సెప్టెంబర్ 21: ఇండియా vs QF 1
- సెప్టెంబర్ 21: పాకిస్తాన్ vs QF 2
- సెప్టెంబర్ 22: శ్రీలంక vs QF 3
- సెప్టెంబర్ 22: బంగ్లాదేశ్ vs QF 4
- సెప్టెంబర్ 24(సెమీ ఫైనల్ 1): QF 1 విజేత vs QF 4 విజేత
- సెప్టెంబర్ 24(సెమీ ఫైనల్ 2): QF 2 విజేత vs QF 3 విజేత
- సెప్టెంబర్ 25(మూడు, నాలుగు స్థానాల కొరకు): SF 1 లూజర్ vs SF 2 లూజర్
- సెప్టెంబర్ 25(ఫైనల్): SF 1 విజేత vs SF 2 విజేత
ఆసియా గేమ్స్ భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివం మావీ, శివం దూబే, ప్రభ్‍సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్‍బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
ఆసియా గేమ్స్ భారత మహిళల జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‍జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టితాస్ సంధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్నూ మణి, కనిక అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనూష బారెడ్డి
స్టాండ్‍బై ప్లేయర్స్: హర్లీన్ డియోల్, కశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.