చరిత్ర సృష్టించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్ విభాగంలో స్వర్ణం

చరిత్ర సృష్టించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్ విభాగంలో స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈక్వెస్ట్రియన్ టీమ్ డ్రస్సేజ్‌ విభాగంలో సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్ ఛేడా, అనుష్ గార్వాలా మరియు దివ్యకృతి సింగ్‌లతో కూడిన జట్టు బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ ఈ విభాగంలో స్వర్ణం గెలవడం గమనార్హం. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 4కు చేరింది.

1982 ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారి ఈ విభాగంలో స్వర్ణం సాధించింది. ఈక్వెస్ట్రియన్ టీమ్ డ్రస్సేజ్ ఈవెంట్‌లో 209.205 స్కోరుతో భారత్ అగ్రస్థానంలో నిలవగా, చైనా 204.882 స్కోరుతో రెండో స్థానం(రజతం), 204.852 స్కోరుతో హాంకాంగ్ 3వ స్థానం(కాంస్యం)లో నిలిచాయి.

Also Read :- ముచ్చటగా మూడోసారి.. 70 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడైన WWE స్టార్