చైనాలోని హాంగ్జౌ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి ఆసియన్ గేమ్స్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలిసారి ఈ పోటీలలో భారత అథ్లెట్లు, ఇతర క్రీడాకారులతో పాటు క్రికెటర్లు పాల్గొంటున్నారు. అయితే ఈ టోర్నీ కోసం ఎంపికచేసిన భారత జట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. వెన్ను నొప్పి కారణంగా శివమ్ మావి ఈ టోర్నీకి దూరమవ్వుగా.. అతని స్థానంలో ఆకాష్ దీప్‌ను ఎంపిక చేశారు. అలాగే, మహిళా జట్టు స్టాండ్‌బై లిస్ట్‌లో అంజలి సర్వాణి స్థానంలో పూజా వస్త్రాకర్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ టోర్నీలో మహిళల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచే మొదలుకానుండగా.. పురుషుల క్రికెట్ మ్యాచ్ లు సెప్టెంబర్ 27న మొదలవునున్నాయి. భారత పురుషుల క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఈ మ్యాచ్‌లన్నీ హాంగ్‌జౌలోని జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరగనున్నాయి.
భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, ప్రభ్‍సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివం దూబే, ఆకాష్ దీప్.
స్టాండ్‍బై ప్లేయర్స్: యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దేవిక వైద్య, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనూషా బారెడ్డి, పూజా వస్త్రాకర్.
స్టాండ్‍బై ప్లేయర్స్: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాక్.
మెన్స్ క్రికెట్ షెడ్యూల్:
- సెప్టెంబర్ 27: నేపాల్ vs మంగోలియా (గ్రూప్ ఏ)
- సెప్టెంబర్ 28: జపాన్ vs కంబోడియా (గ్రూప్ బి)
- సెప్టెంబర్ 28: మలేషియా vs సింగపూర్ (గ్రూప్ సి)
- సెప్టెంబర్ 28: మంగోలియా vs మాల్ద్వీస్ (గ్రూప్ ఏ),
- సెప్టెంబర్ 29: కాంబోడియా vs హాంకాంగ్ (గ్రూప్ బి)
- సెప్టెంబర్ 29 : సింగపూర్ vs థాయిలాండ్ (గ్రూప్ సి)
- అక్టోబర్ 1: మాల్దీవులు vs నేపాల్ (గ్రూప్ ఏ)
- అక్టోబర్ 1: హాంకాంగ్ vs జపాన్ (గ్రూప్ బి)
- అక్టోబర్ 2: థాయిలాండ్ vs మలేషియా (గ్రూప్ సి)
- అక్టోబర్ 3: ఇండియా vs QF 1
- అక్టోబర్ 3: పాకిస్తాన్ vs QF 2
- అక్టోబర్ 4: శ్రీలంక vs QF 3
- అక్టోబర్ 4: బంగ్లాదేశ్ vs QF 4
- అక్టోబర్ 6(మొదటి సెమీ ఫైనల్): QF1 విజేత vs QF4 విజేత
- అక్టోబర్ 6(రెండవ సెమీ ఫైనల్): QF2 విజేత vs QF3 విజేత
- అక్టోబర్ 7(మూడు, నాలుగు స్థానాల కొరకు): SF 1 లూజర్ vs SF 2 లూజర్
- అక్టోబర్ 7(ఫైనల్): SF 1 విజేత vs SF 2 విజేత
మహిళల క్రికెట్ షెడ్యూల్:
- సెప్టెంబర్ 19: ఇండోనేషియా vs మంగోలియా (గ్రూప్ ఏ)
- సెప్టెంబర్ 19: హాంకాంగ్ vs మలేషియా (గ్రూప్ బి)
- సెప్టెంబర్ 20: మొదటి మ్యాచ్ లూజర్ vs రెండవ మ్యాచ్ లూజర్
- సెప్టెంబర్ 21: ఇండియా vs QF 1
- సెప్టెంబర్ 21: పాకిస్తాన్ vs QF 2
- సెప్టెంబర్ 22: శ్రీలంక vs QF 3
- సెప్టెంబర్ 22: బంగ్లాదేశ్ vs QF 4
- సెప్టెంబర్ 24(సెమీ ఫైనల్ 1): QF 1 విజేత vs QF 4 విజేత
- సెప్టెంబర్ 24(సెమీ ఫైనల్ 2): QF 2 విజేత vs QF 3 విజేత
- సెప్టెంబర్ 25(మూడు, నాలుగు స్థానాల కొరకు): SF 1 లూజర్ vs SF 2 లూజర్
- సెప్టెంబర్ 25(ఫైనల్): SF 1 విజేత vs SF 2 విజేత