చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు భారత క్రీడాకారిణిల మధ్య చిచ్చు పెట్టాయి. మెడల్ చేజారిందన్న కోపంతో హైపథ్లాన్ అథ్లెట్ స్వప్న బర్మ.. తోటి అథ్లెట్, తెలంగాణ గురుకుల యువతి అగసర నందినిపై సంచలన ఆరోపణలు చేసింది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణకు దిగింది. హైపథ్లాన్ పోటీల్లో ఓడిన ఆమె.. గెలిచిన నందిని ఒక ట్రాన్స్‌జెండర్ అని ఆరోపించింది.
- ALSO READ | ODI World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్లు వీరే.. ధోనీది ఎన్నో స్థానమంటే..?
ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన హెప్తథ్లాన్ పోటీల్లో స్వప్న బర్మ 57.08 పాయింట్లు సాధించగా.. అగసర నందిని 57.12 పాయింట్లు సాధించి రజత పతకం గెలుచుకుంది. దీంతో పతకం రాలేదన్న బాధలో స్వప్న.. నందినిపై వ్యక్తిగత ఆరోపణలు చేసింది. తాను.. ఒక ట్రాన్స్‌జెండర్ చేతిలో ఓడిపోయానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అయితే ఆ ట్వీట్‌లో ఎక్కడా నందిని పేరు ప్రస్తావించనప్పటికీ.. ఆమె అని స్పష్టమవుతోంది.
A journey of strength & endurance ?
— Sony LIV (@SonyLIV) October 1, 2023
Nandini Agasara secures the ? in Women's #Heptathlon at the #HangzhouAsianGames, with a spectacular personal best in the 800m ?#AsianGames2023 #Athletics #TeamIndia #Cheer4India #SonyLIV pic.twitter.com/yEsSoldpJZ
ఆ ట్వీట్ వివాదాస్పదం అవుతుండడంతో కాసేపటి అనంతరం ఆమె సదరు పోస్ట్ తొలగిం చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో సదరు ట్వీట్ స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. అథ్లెటిక్స్ నియమావళి ప్రకారం.. తోటి అథ్లెట్లను నేరుగా విమర్శించడం లేదా ఆరోపణలు చేయడం తగదు. అయితే ఆ రూల్స్ అతిక్రమించిన ఆమెపై అథ్లెటిక్ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Controversy Alert! ?
— Sportskeeda (@Sportskeeda) October 2, 2023
India's Swapna Barman says on Twitter that she lost out her medal to a "transgender woman" in Women's Heptathlon.
India's Nandini Agasara won the Bronze Medal in the same event while Barman finished 4th.
The Tweet has now been deleted.#AsianGames2022… pic.twitter.com/jyv5bZ6H1i
#HangzhouAsianGames
— Vinayakk (@vinayakkm) September 30, 2023
Athletics, Women's Heptathlon, High Jump
Swapna Barman in tears as she misses her third attempt & tops out at 1.70m. In an event where she has 1.87 PB, has left out points here. Composes herself in a minute. Still 5 events to go.https://t.co/f2EadqrQHG pic.twitter.com/QHgua9wJ5V